14 July, 2026 | 11:23 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

డిప్యూటీ సీఎంతో జపాన్ ఫిలిం బృందం భేటీ

29-11-2025 12:00 AM
  1. డిజిటల్ పైరసీ కట్టడిపై ప్రత్యేక ఎంవోయూపై సంతకం 
  2. టోక్యో అసోసియేషన్‌తో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒప్పందం 

సినిమా ప్రతినిధి, నవంబర్ 28 (విజయక్రాంతి): డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతు ఇస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క  హామీ ఇచ్చారు. సీవోడీఏ (కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ టోక్యో) జపాన్ ఫిల్మ్, అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌ను సందర్శించింది.

టోక్యోలోని సీవోడీఏ ప్రతినిధి డైరెక్టర్ టకేరో గోటో, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ సీనియర్ డైరెక్టర్ తత్సుయ ఓట్సుకా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సందర్శించి ఓ ఎంవోయూపై సంత కం చేశారు. డిజిటల్ పైరసీకి వ్యతిరేకంగా బెస్ట్ ప్రాక్టీసెస్, వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలపై నాలెడ్జ్‌ను పంచుకోవడానికి ఈ ఎంవోయూ రూపొం దించారు.

ఈ సందర్భంగా సీవోడీఏ బృందం.. మల్లు భట్టి విక్రమార్కతో ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎంకు సీవోడీఏ గురించి, ప్రపంచవ్యాప్తంగా జపనీస్ కంటెంట్‌కు పెరుగుతున్న ప్ర జాదరణ గురించి వివరించా రు. జపాన్‌లో తెలుగు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ గురించి కూడా తెలిపారు. డిజిటల్ పైరసీని సమర్థంగా ఎదుర్కోవడానికి సీవోడీఏ ప్రాతినిధ్యం వహిస్తున్న జపనీస్ ఫిల్మ్, అనిమే పరిశ్రమ తెలుగు ఫిలిం చాంబర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చాంబర్ బాధ్యులు తెలిపారు.

ఒప్పందం కుదుర్చుకోవడంపై ఉభయ బృందాలను డిప్యూటీ సీఎం అభినందించా రు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ సెక్రటరీ కేఎల్ దామోదర్ ప్రసాద్, రా మానాయుడు స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్‌బాబు దగ్గుబాటి, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ, యాంటీ వీడియో పైరసీ సెల్ టీఎఫ్‌సీసీ చైర్మన్ రాజ్‌కుమార్ ఆకెళ్ల, ఏవీపీసీ ఆపరే షన్స్ హెడ్ వై.మనీంద్ర పాల్గొన్నారు.