30 June, 2026 | 2:11 PM

జాస్మిన్ జోరు

06-06-2024 12:15 AM

మట్టికోటపై పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఎలీనా రైబాకినాకు షాక్ ఇస్తూ ఇటలీ చిన్నది జాస్మిన్ పవోలినీ సెమీస్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కారాజ్  టైటిల్ వేటలో మరింత ముందంజ వేశాడు. టోర్నీలో తన జోరు కొనసాగిస్తున్న అల్కారాజ్ అలవోకగా సెమీస్‌కు దూసుకెళ్లాడు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న భారత స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి డబుల్స్ సెమీస్‌కు చేరి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. 

పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో జాస్మిన్ పవోలిని (ఇటలీ) సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ 6 4 6 రైబాకినా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. 2 గంటల 3 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న పవోలిని రెండో సెట్‌ను మాత్రం రైబాకినాకు కోల్పోయింది. అయితే కీలకమైన మూడో సెట్‌లో విజృంభించిన జాస్మిన్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవ సం చేసుకుంది. మ్యాచ్‌లో పవోలిని 7 బ్రేక్ పాయింట్లు, 22 విన్నర్లు సంధించింది. అయితే రైబాకినా 48 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.  మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అరీనా సబలెంక 7 (7/5), ౪౬, ౪్ధ౬తో ఆండ్రీవా చేతిలో పరాజయం పాలైంది.