18 August, 2026 | 4:25 PM

Breaking News

సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •   బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం   •   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు   •   ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మార్వో   •   బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి   •  

పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

05-05-2026 06:20 PM

జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు

జవహర్ నగర్,(విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగలు... వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రజలు శాంతియుతంగా మెలగాలని కోరుతూ జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు ఆధ్వర్యంలో మంగళవారం ముస్లిం హిందూ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ పండుగల మాటున అల్లర్లు సృష్టించాలని చూస్తే సహించేది లేదని ఎంతటి వారినైనా వదిలి పెట్టబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘర్షణలు జరిగే ఆస్కారం ఉంటే ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోదర భావంతో ప్రజలు పండుగలు జరుపుకోవాలని సూచించారు.