30 July, 2026 | 10:56 AM

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి

24-06-2024 01:46 PM

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుండి తన జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్న తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ.. వాకిటి సత్యం రెడ్డి జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి రాజీనామా చేశారు. జీవన్ రెడ్డి ఇంటికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.