30 July, 2026 | 11:31 AM

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి

24-06-2024 01:24 PM

న్యూఢిల్లీ: సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో, బీజేపీ ఆశీస్సులతో రెండోసారి లోక్ సభలో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఐదేళ్లు.. చిత్తశుద్ధి, అంకితభావంతో, నిబద్ధతతో సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. లోక్ సభలో పంచెకట్టులో పద్దతిగా కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.