15 March, 2026 | 7:19 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఉడిపి హోటల్ ఇడ్లీలో జెర్రీ

14-10-2024 12:55 AM
  1. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు
  2. జగిత్యాలలో ఘటన

జగిత్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాల తహసిల్ చౌరస్తాలోని ఉడిపి హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ రావడంతో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఉదయం ఓ మహిళ తన కుటుంబంతో కలిసి గణేష్ భవన్ ఉడిపి హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేసింది.

తన పిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది. షాక్‌కు గురైన ఆమె హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ ఎదుట కుటుంబంతో కలిసి బైఠాయించింది. మొదట జెర్రీ కాదని, అది కేవలం నల్ల దారం అని చెప్పిన యజమాని, తన మాటలకు కట్టుబడి ఉండలేక ఇడ్లీని నోట్లో వేసుకోవడాని కూడా ప్రయత్నించాడు.

జెర్రీ అని నిర్ధారించుకున్న తర్వాత హోటల్ యజమాని ఆ ఇడ్లీని ఉమ్మివేశాడు. అప్పటికే గుమికూడిన ప్రజలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ యాజమాన్యం ఇడ్లీలను మున్సిపల్ ట్రాక్టర్ దారా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బాధితురాలు ఇతర ప్రజలు అడ్డుకున్నారు.

ఇడ్లీలను రోడ్డు మీదే పారవేసి, ప్రజారోగ్య పరి రక్షణకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ ఫిర్యాదుతో హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.