15 March, 2026 | 5:42 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

వైన్స్‌లో రూ.10.80 లక్షల చోరీ

14-10-2024 12:56 AM

పైకప్పు తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగుడు

నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఘటన 

నల్లగొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని వైన్స్‌షాపులో శనివారం అర్ధరాత్రి సినీఫక్కీలో చోరీ జరిగింది. గుర్రంపోడులోని ఆదిత్య వైన్స్‌షాపు నిర్వాహకులు శుక్ర, శనివారం మద్యం విక్రయించగా వచ్చిన నగదును కౌంటర్‌లో దాచారు.

దసరా పండుగ కావడం.. రెండురోజులు భారీగా గిరాకీ ఉండటంతో తీరిక లేక నగదును కౌంటర్‌లోనే ఉంచి రాత్రి దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఓ దుండగుడు శనివారం అర్ధరాత్రి షాపు పైకప్పు రేకులు తొలగించి దుకాణంలోకి దూకి కౌంటర్‌లోని నగదును అపహరించాడు. ఆదివారం ఉదయం నిర్వాహకులు దుకాణం తెరవగా పైకప్పు తొలగించి ఉండటం, కౌంటర్‌లో నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడింది ఒక్కరేనని నిర్ధారించారు. దుండగుడు కౌంటర్ నుంచి నగదు తీసి లెక్కిస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.