1 April, 2026 | 11:55 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత

01-04-2026 10:38 AM
  1. విమాన టికెట్ల ధరలు భారీ పెరిగే అవకాశం
  2. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
  3. పెరిగిన కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు

న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరలు(Jet fuel prices) ఆకాశాన్నంటాయి. కిలో లీటర్ విమాన ఇంధన ధర రికార్డు స్థాయిలో రూ. 2.07లక్షలకు చేరింది.  గత ధరలతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కంటే ధరలు ఎక్కువ పెరిగాయి. గతంలో కిలో లీటర్ కు రూ. 96,638 ఉండగా.. ఏకంగా రూ. 2.07 లక్షలకు చేరింది. ఏటీఎఫ్ ధర కిలో లీటర్ కు రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా విమాన ఇంధన ధరల పెరిగాయి.

విమాన ఇంధన ధరలపై అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెంపు ప్రభావం పడింది. విమాన సంస్థల నిర్వహణల వ్యయంలో ఇంధనానికే 40 శాతం వాటా కేటాయిస్తారు. ఇంధన ధరల పెంపు భారాన్ని విమాన సంస్థలు ప్రయాణికులపై మోపే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే విమాన టికెట్లు ధరలు భారీ పెరిగే సూచనలు కనబడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలా, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు సుమారు రూ.195.50 నుండి రూ.218 వరకు పెంచబడ్డాయి.