దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు
- వేతన జీవులకు ఉపశమనం..
- దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం..
- రూ. 4 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు
- పొరపాట్ల సవరణకు 4 ఏళ్ల గడువు
- ఆదాయం రూ. 24 లక్షలు దాటితే 30 శాతం పన్ను
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా సరళమైన కొత్త ఐటీ చట్టం(New Income Tax rules) అమలులోకి వచ్చింది. నోటీసులు, అప్పీల్లు, వివాదాల పరిష్కారానికి ఫేస్ లెస్, ఏఐ ఆధారిత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఐటీ రిటర్న్స్ లో జరిమానా లేకుండా పొర పాట్ల సవరణకు 4 ఏళ్ల వరకు గడువు విధించారు. వేతన జీవులకు గణనీయమైన ఉపశమనం కల్పించేలా శ్లాబుల రూపకల్పన చేశారు.
సెక్షన్ 87ఏ ప్రకారం రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను మినహాయింపు కల్పించారు. కొత్త శ్లాబుల ప్రకారం రూ. 4 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయించారు. రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరక 5 శాతం పన్ను, రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు 25 శాతం పన్ను విధించనున్నారు. ఆదాయం రూ. 24 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధించనున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.




