2 April, 2026 | 10:31 PM

ప్రచారాన్ని వేగవంతం చేయాలి

03-05-2024 12:29 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, మే 2 : బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివా సంలో మున్సిపల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యా రు. మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న పార్టీ ప్రచారాల తీరును పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. బూత్‌స్థాయి సమావేశాల ద్వారా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారాలను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కాటా రాజుగౌడ్, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.