calender_icon.png 3 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5న పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాబ్ మేళా

03-12-2025 01:10:18 AM

  1. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జాబ్ మేళాలో 15 కంపెనిలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, డిసెంబర్-02(విజయ క్రాంతి)నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో డిసెంబర్ 5న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా టాస్క్ రీజనల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని,జాబ్ మేళా కార్యక్రమానికి ఐటి, ఐటి యేతర 15 కంపెనీలు హాజరవుతాయని, డిగ్రీ, బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐటిఐ డిప్లమా కో ర్సులు చేసిన నిరుద్యోగ యువత జాబ్ మేళా కు హాజరు కావాలన్నారు.

కంపెనీ ప్రతినిధులు విద్యార్థులను ఇంటర్వ్యూ నిర్వహించి వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందని, అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని ఆసక్తిగల నిరుద్యోగ యువత డిసెంబర్ 5న నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమానికి 3 నుంచి 4 సెట్ల తమ రెస్యూమ్ కాపీలతో హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.