calender_icon.png 3 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

03-12-2025 01:08:37 AM

బోయినపల్లి: డిసెంబర్ 2 ( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బోయినపల్లి మండలంలో రెండో విడత సర్పంచ్ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా మంగళవారం నామినేషన్ల స్వీకరణకుచివరి ఘట్టం కావడంతో సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం వరకు 23 గ్రామ పంచాయతీల గాను 104 నామినేషన్లు దాఖలుగా మంగళవారం మండలంలోని కోరం బోయినపల్లి విలాసాగర్ వెంకటరావుపల్లి కొదురుపాక నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్‌అధికారులకు సర్పంచ్ పదవికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా కేంద్రాల్లో బారులు తీరారు. ఐదు గంటల లోపు నామినేషన్ కేంద్రంలో ఉన్న సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులకు టోకెన్ నెంబర్లు ఇచ్చి క్యూలో తీసుకుంటున్నారు.

ఈ మేరకు బోయినపల్లి ఎంపీడీవో భీమా జయ శీల నామినేషన్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నామినేషన్ స్వీకరణలో ఎటువంటి జాబ్ జరగకుండా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మంగళవారం మరో 100 వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నది. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. నామినేషన్ స్కూటీని ఉపసంహరణ వరకు బరిలో ఉండే అభ్యర్థులు మరొ మరో కొందరిని బుజ్జగించి నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు అభ్యర్థులు నాన తంటాలు పడుతున్నారు.