calender_icon.png 3 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ హౌసింగ్ కాలనీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి

03-12-2025 01:11:34 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణంలోని పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం,జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనిలో 37 మంది వాటర్ మెన్ లు ఉన్నా నీటి సమస్య వస్తుందని,ప్రజలకు నీటి సరఫరా లో సమస్య లేకుండా వాటర్ మెన్ లను అధికారులు పర్యవేక్షించాలన్నారు.అమృత్ 2.0 పథకం లో నిధులు ఉన్నాయని నిధులు వెచ్చించి తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

వేసవి కాలంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ పై ఆధారపడకుండా,తాగు నీటికి శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని,నీటి సరఫరా కు మోటార్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.ధర్మసముద్రం, ఎస్ కే ఎన్ ఆర్ కళాశాల వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ల పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.అర్బన్ హౌసింగ్ కాలని లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా వాణిజ్య సముదాయాల (వెండింగ్ జోన్) ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టాలని అధికారులకు సూచించారు.

హరిత హారం లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కు చర్యలు తీసుకోవాలని,మొక్కలు లేని దగ్గర మొక్కలను నాటాలని అన్నారు.జగిత్యాల పట్టణంలో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని లేఅవుట్ ప్రకారం సెట్ బాక్ తీసుకొని ఇంటి,వాణిజ్య సముదాయాలు నిర్మించే విధంగా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు.ఈ సమావేశంలో కమిషనర్ స్పందన, డీ ఈ ఆనంద్, టీపిఓ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ లు అధికారులు పాల్గొన్నారు.