20 June, 2026 | 6:36 PM

Breaking News

సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •   కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు   •   ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలి   •  

నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా

16-10-2024 07:44 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అక్టోబర్ 20వ తేదీన ఘట్ కేసర్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్ కేసర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. కొంగర కలాన్ లోని ప్రముఖ ఎలక్ట్రానికి కంపెనీ లో ఉద్యోగాల నిమిత్తం ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు ఇంటర్వూ ఉంటుందని చెప్పారు. పట్టణంలోని హోళీ ఫేయిత్ గ్రామర్ హైస్కూల్ లో జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు 18 నుండి 30 సంవత్సరాల లోపు యువతీ, యువకులు అర్హులని ఎస్ ఎస్ సీ నుండి డిగ్రీ వరకు చదివిన ధ్రువ పత్రాలు, బయోడెటా, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్ పోర్టు సైజ్ ఫోటో, పాన్ కార్డు జీరాక్స్ కాఫీలు తీసుకురావాలన్నారు. వివరాలకు 90101 11178, 96407 14704, 83419 24283 సంప్రదించాలని కోరారు.