28 July, 2026 | 1:31 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ప్రజాసేవలో పేదలకు... సహాయం చేయండి

06-06-2026 07:50 PM

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

ఘనంగా జోగారావు జన్మదిన వేడుకలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజాసేవలో పేదలకు సహాయం చేయండి అని తద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జవహర్ నగర్ తూర్పు శాఖ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు కర్లపూడి జోగారావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్.. జోగారావుకు శాలువా కప్పి, బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కర్లపూడి జోగారావు మాట్లాడుతూ.. తన జన్మదినం నాడు ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి ఆశీర్వాదాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.  ఈటలచూపిన ఆప్యాయత, అందించిన ఆశీస్సులు నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రజాసేవ పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి" అని పేర్కొన్నారు. పెద్దల ఆశీస్సులు జీవితానికి దిక్సూచి లాంటివని, వారి ప్రోత్సాహం విజయపథంలో ముందుకు నడిపించే మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు.

పార్టీ పెద్దల ఆశీస్సులతో సమాజ సేవలో మరింత నిబద్ధతతో, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా జోగారావు స్పష్టం చేశారు. అలాగే, తన పుట్టినరోజు సందర్భంగా తనకు ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో జోగారావుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.