12 June, 2026 | 5:13 PM

Breaking News

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •  

టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్ నియామకం

12-06-2026 04:06 PM

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జోగు అశోక్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లు జోగు అశోక్ కుమార్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో జోగు అశోక్ కుమార్ చురుకైన పాత్ర పోషించారని, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని అప్పగించినట్లు నాయకులు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి జోగు అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం సంస్థ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.