8 May, 2026 | 2:19 PM

ఆపిల్‌కు కొత్త సీఈవో జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరణ

22-04-2026 01:44 AM

సెప్టెంబర్ ౧ నుంచి బాధ్యతల స్వీకరణ

న్యూయార్క్, ఏప్రిల్ ౨౧: ఆపిల్ సంస్థ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. ఈమేరకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన ఎంపిను ఆమోదించారు. Apple కొత్త CEOగా జాన్ టెర్నస్ నియమితులై, సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారుప్రస్తుత సీఈవో టిమ్ కుక్ సెప్టెంబర్ 1న నుంచి తన బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత, జాన్ టెర్నస్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. మెకానికల్ ఇంజిరింగ్‌లో పట్టా పొందిన జాన్ టెర్నస్ 2001 నుంచి సంస్థలో పనిచేస్తున్నారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వంటి విప్లవాత్మక ఉత్పత్తుల వెనుక ఆయన కృషి ఉంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మాక్ కంప్యూటర్లు, మాక్ బుక్ నియో, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ తయారీలోనూ ఆయన పాత్ర ఉంది. జాన్ టెర్నస్ ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ మార్పు ప్రపంచ టెక్ రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి

టెక్ రంగంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో ఆపిల్ సంస్థ వెనుకబడి ఉంది. మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఆపిల్ సంస్థపైనా కూడా ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. టిమ్ కుక్ నాయ కత్వంలో సంస్థ షేర్ల విలువ దాదాపు 2,000 శాతం పెరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తర్వాత ఆపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. జాన్ టెర్నస్ కూడా అదే బాటలో పయనిస్తారని నిపుణులు భావిస్తున్నారు. టిమ్‌కుక్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు.

 మరిన్ని National News కోసం ఈ విభాగాన్ని చూడండి


FAQ's

1. John Ternus ఎవరు?

జాన్ టెర్నస్ ఆపిల్ సంస్థలో 2001 నుంచి పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్.

2. Tim Cook ఎప్పుడు పదవి నుంచి తప్పుకుంటారు?

టిమ్ కుక్ సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతల నుంచి తప్పుకుంటారని సమాచారం.

3. Apple Inc. కొత్త CEO ఎవరు?

ఆపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు.