15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సమతా సైనిక్ దళ్ క్యాడర్‌లో చేరండి

01-02-2026 06:58 PM

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు అంబేద్కర్ ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళ్ క్యాడర్‌లో చేరి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మార్షల్ దుర్గం సందీప్ పిలుపునిచ్చారు. ఆదివారం వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీ నగర్, అంబేద్కర్ నగర్‌లో నిర్వహించిన సమతా సైనిక్ దళ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

వాంకిడి మండలంలోని ప్రతి గ్రామంలో సమతా సైనిక్ దళ్ గ్రామ శాఖలను ఏర్పాటు చేసి విద్యా భివృద్ధి, శారీరిక వ్యాయామం, సామాజిక కార్యక్రమాలు చేయడానికి యువకులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్రే విజయ్, అంబేద్కర్ యువజన సంఘం కమిటీ మెంబర్ డోంగ్రే రమేష్, శ్యామ్ రావు ఉప్రే, ఉపాసకులు కోబ్రగడే కుమార్, సమతా సైనిక్ దళ్ మండల్ క్యాడర్ సభ్యులు పాల్గొన్నారు.