calender_icon.png 1 February, 2026 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెట్ బాల్ క్రీడాలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత

01-02-2026 07:01:29 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సీఎం కప్పు మండల స్థాయి టోర్నమెంటులో తాండూర్ క్లస్టర్లో నుండి నిలిచిన విద్యార్థులకు బహుమతులు మండల బిజెపి నాయకురాలు మీరతాయి ఆదివారం అందజేశారు.సీఎం కప్పు మండల స్థాయి టోర్నమెంట్లో నెట్ బాల్లో మొదటి, రెండవ బహుమతిలు గెలుపొందారు. ఈ సందర్భంగా ఆ యొక్క విద్యార్థులకు గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ సమక్షంలో మండల బిజెపి నాయకురాలు మీరాతాయి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు క్రీడాలు మరియు చదువుల పట్ల శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు ఆమె శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి గుల్లపల్లి లక్ష్మి నారాయణ, ఉప సర్పంచ్ జయరాజు,గ్రామ కార్యదర్శి రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు.