calender_icon.png 28 October, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

28-10-2025 12:05:37 AM

చిట్యాల, అక్టోబర్ 27(విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సాగర్ల భిక్షం ఆ పార్టీ కి రాజీనామా చేసి హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర డయిరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  గుత్తా అమిత్ కుమార్ రెడ్డి    నివాసంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

వారికి  అమిత్ కుమార్ రెడ్డి  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు జాల గోపాల్, జాల మల్లేష్, మాధగోని నాగయ్య ,మాధగోని లింగ స్వామి మరియు తదితరులు  పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుత్తా దేవేందర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి,  గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య,

సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, పాకాల దినేష్, కురుపటి లింగయ్య, బొడ్డు శ్రీను, ఉయ్యాల నరేష్, పందుల గోపాల్, రూపని భిక్షం, రూపని యాదయ్య, కంచర్ల జెన్నా రెడ్డి, సుంకరి వెంకన్న, కంబాలపల్లి లింగయ్య, సుంకరి కిరణ్, పెద్దగోని నాగేష్, అంతటి నాగరాజు, సాగర్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.