calender_icon.png 28 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలి

28-10-2025 12:04:41 AM

-మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

-బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

చేవెళ్ల , అక్టోబర్ 27 : రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. సోమవారం నగరంలోని ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్టారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల మండల పరిధి అంతారం గ్రామాని చెందిన ఆండాలుబాలన్నగౌడ్, పది మంది గ్రామస్తులు మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రులు బీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఏఒక్కటీ సక్రమంగా అమలుకు చోచుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధాలనాలకు నిదర్శనమన్నారు.

బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తూ రేవంత్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజలకు తెలియజెప్పేలా ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టాను విప్పి కాంగ్రెస్ బాకీ కార్డును చూపుతూ ప్రజలకు ప్రభుత్వ పనితీరును తెలియపర్చేలా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అంతారం గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బాకపురం రామస్వామి, గ్రామస్తులు బాకపురం యాదమ్మ, బేగరి శేఖర్, ఇటుకాల నర్సింలు, ఖానపురం జంగయ్య, సందీప్ పాల్గొన్నారు.