calender_icon.png 28 October, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు

28-10-2025 12:07:58 AM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

నల్గొండ క్రైం, అక్టోబర్ 27: బాధితుల పిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్ పి శరత్ చంద్ర ఫవార్ అన్నారు.  సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యల తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో,బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించేవారి పట్ల,నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని  అధికారులను కోరారు