అవినీతికి చిరునామా కాంగ్రెస్
n పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ అవినీతికి చిరునామా అయితే, బీజేపీ మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆదివారం అమీన్‌పూర్ మండలంలోని పటేల్‌గూడ గ్రామంలో ఎంపీపీ దేవానందం నివాసం లో మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమావేశమయ్యారు.
సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకట్రాంరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి భారీ మెజార్టీ అందిం చాలని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించి ఓట్లు సాధించాలని ఆయన నాయకులను కోరా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు, సీని యర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






