సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
02-05-2024 01:11 AM
రాజేంద్రనగర్, మే 1 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ప్రధా న కార్యదర్శి పలుగుచెరువు మహేష్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సమక్షంలో పలుగుచెరువు మహేష్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన మహేష్‌కు పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలుగుచెరువు మహేష్ మాట్లాడు తూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అవు తుందన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలువబోతుందని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు అనుముల జాన్‌పాల్, మహేందర్, విశాల్, మహేష్, అరుణ్‌బాబు, సురేష్, ప్రశాంత్, శాంతికుమార్, కిశోర్, శ్రీనివాస్ ఉన్నారు.




