700 మందికి అన్నదానం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేనీ(ముజీబ్) ఆధ్వర్యంలో మే డే పురస్కరించుకుని మెహదీ నవాబ్ జంగ్ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద 700 మంది రోగుల సహాయకులకు బుధవారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్టు కోశాధికారి సయ్యద్ అసద్ ఉద్దీన్ హుస్సేనీ, జిల్లా సభ్యులు కేఆర్ రాజ్‌కుమార్, కుర్రాడి శ్రీనివాస్, శంకర్, ఏవీ శీధర్, ఆసుపత్రి యూనిట్ కార్యదర్శి చంద్రశేఖర్ హజరయ్యారు. అనంతరం ముజీబ్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి నాంపల్లి క్యాన్సర్ ఆసుపత్రికి నిరుపేదలు వస్తారన్నారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వచ్చినవారికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉస్మాని అలీ ఉస్మాని, ఏపీఆర్‌వో మహమ్మద్ వహీద్, మొహమ్మద్ ముస్తఫా షరీఫ్, హబీబ్ చావూస్ తదితరులు పాల్గొన్నారు.




