శంషాబాద్‌లో స్వీప్ కార్యక్రమం
02-05-2024 01:12 AM
రాజేంద్రనగర్, మే 1: ప్రతి ఒక్క రూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమం ఉపయోగప డుతున్నదని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. బుధవారం ఐ ఓట్ ఫర్ షూర్ అనే థీమ్‌తో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మెహింది గార్డెన్స్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోని సీనియర్ సిటిజన్స్‌కు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, శాని టరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, కాలనీ ప్రెసిడెంట్ ఖాజా, సీనియర్ సిటిజన్స్, కాలనీవాసులు పాల్గొన్నారు.




