అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
మళ్లీ వచ్చేది అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వమే
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయ రమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, మా ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలలోనే దేశంలోని ఎక్కడలేని విధంగా పేద ప్రజలను గుర్తించి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు, వచ్చేది కూడా తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రజలే మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ చైర్మన్ అంతటి పుష్పలత మాట్లాడుతూ ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే విజయ రంగారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి మరువలేనిదని కొనియాడారు, పదో వార్డుతో పాటు సుల్తానాబాద్ మున్సిపల్ లో పలుచోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజయ రమణారావు కు వినతిపత్రం సమర్పించారు, అనంతరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ను విజయ రమణారావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కమిషనర్ రమేష్ , తాసిల్దార్ బసిరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధను నాయక్ దామోదర్ రావు, కౌన్సిలర్లు గరిగే శోభారాణి, శ్రీనివాస్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నామని రాజిరెడ్డి , సర్పంచులు జూపల్లి తిరుమలరావు , చిలుక సతీష్ , ఏరుకొండ రమేష్ , శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..




