తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు శనివారం టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మ ల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వారికే పార్టీ లో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ నగేష్ ముదిరాజ్ ,రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ ,సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రేమలతా, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, మెదక్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సిద్దిపేట జిల్లా అ ధ్యక్షుడు బిక్షపతి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి నర్సింగ్, షాదుల్ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ, జహీరాబాద్ ఇంచార్జ్ నర్సింహ, మెదక్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ రవీందర్, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ హర్ష, మెదక్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ పాల్గొన్నారు.
విద్యార్థుల ఐక్యతే గెలిచింది
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పూర్తిగా దేశవ్యాప్తంగా ఉద్యమిం చిన విద్యార్థుల విజయమని టీఆర్పీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఇది కేవలం విద్యార్థుల ఐక్యత, పట్టుదల, పోరాట స్ఫూర్తి సాధించిన విజయమని స్పష్టం చేశారు. విద్యార్థులు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నునా సాధించగలరని, ఎంతటి ప్రభుత్వాన్నునా ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాల ద్వారా తలవంచించగలరని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందని అన్నారు.
ఈ ఉద్యమం ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలకు ఒక గట్టి హెచ్చరిక అని తీన్మార్ మల్లన్న అన్నారు. కాక్రోక్ జనతా పార్టీ, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి రోజు నుంచే పూర్తి మద్దతు అందిస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా కాక్రోక్ జనతా పార్టీ చేపట్టే ప్రతి ప్రజా ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.






