3 April, 2026 | 1:56 AM

హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

03-04-2026 12:00 AM

జిన్నారం/ అమీన్ పూర్, ఏప్రిల్ 2 : పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని బొల్లారం పోచమ్మ బస్తీకి చెందిన బొల్లారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మొహమ్మద్ రఫీ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఇంచార్జ్ వెన్నవరం ఆదర్శ రెడ్డి, పటాన్ చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బొల్లారం మాజీ కౌన్సిలర్ వి.బీరప్ప యాదవ్, మాజీ ఎంపీటీసీ అరూర్ రత్నం, భాస్కర్ రెడ్డి, సింహాచలం, మొహమ్మద్ నూర్, రాంశిష్, గోపాల కృష్ణ, ఏడుకొండలు, తురాబ్ అలీ ఖాన్, నాజీమ్ అన్సారీ, ఫయాజ్ ఖాన్, రాజు, మొహమ్మద్ మోసిన్ ఖాన్, మొహమ్మద్ యాసీర్ పాల్గొన్నారు.