5 May, 2026 | 1:06 PM

జర్నలిస్ట్ రైల్వేపాసులు పునరుద్ధరించాలి

28-11-2024 02:38 AM

కేంద్ర మంత్రికి ఎంపీ ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): కరోనా సమయంలో జర్నలిస్టులకు నిలిపేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యి మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని.. పలు ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణం త్వరగా చేపట్టాలని మంత్రిని కోరారు.