ప్రభాస్ 'ఫౌజీ' చిత్ర బృందానికి ఘోర ప్రమాదం
05-05-2026 11:24 AM
ప్రభాస్ రాబోయే చిత్రం 'ఫౌజీ' (Fauzi) బృందం, హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరగనున్న సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సినిమా షూటింగ్ ఆపేసినట్లు చిత్ర యూనిట్(Prabhas Fauzi Film Crew) తెలిపింది. ఈ ఘటనపై చిత్ర బృందం, స్థానిక అధికారులు ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 'Fauzi' చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయింది. ఈసారి అక్టోబర్ నుండి క్రిస్మస్ లోపు, ఎప్పుడైనా ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.






