న్యాయమూర్తి నారం అరుణ్ కుమార్‌కు ఘన సన్మానం
05-05-2026 11:11 AM
ఆమనగల్: ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన నారం అరుణ్ కుమార్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి నుండి బదిలీపై వచ్చి ఆమనగల్ కోర్టులో బాధ్యతలు చేపట్టిన ఆయనకు న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు.బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకర్ యాదిలాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ శర్మ, దుడ్డు ఆంజనేయులు, మల్లేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.






