calender_icon.png 19 January, 2026 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎబీజేపీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమేష్ గౌడ్

19-01-2026 03:57:42 PM

జైపూర్,(విజయక్రాంతి): అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ABJPF) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన జర్నలిస్ట్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియమితులయ్యారు. జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు, మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ చైర్మన్ ఈసంపెల్లి వేణు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్  బింగి సుధాకర్, అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొడక్షన్స్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ సింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.