19-01-2026 03:54:08 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. మందమర్రి ఎస్సై ఎస్ రాజశేఖర్ ను కోటపల్లి ఎస్ హెచ్ ఓగా, కోటపల్లి ఎస్సై ఏ రాజేందర్ ను రామగుండం వీఆర్ గా, జైపూర్ ఎస్సై జే శ్రీధర్ ను రామకృష్ణాపూర్ ఎస్ హెచ్ ఓగా, రామకృష్ణాపూర్ ఎస్ హెచ్ ఓ భూమేష్ ను జయశంకర్ భూపాలపల్లి వీఆర్ గా, జయశంకర్ భూపాలపల్లి ఎస్సై గోపతి నరేష్ ను మందమర్రి ఎస్ హెచ్ ఓగా, రామగుండం సీసీఆర్బీ జీ రాజశేఖర్ ను జైపూర్ ఎస్ హెచ్ ఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.