ప్రజా చైతన్య ఆయుధం కలం
ప్రజల కోసం నిత్యం అక్షరాలను ధారపోస్తూ ధర్మయుద్ధం చేసే ప్రజల గొంతుక పత్రిక. నిరంతరం నిజం కోసం పోరాటం చేస్తూ, నిత్యం ప్రజా చైతన్య పోరులో ఆక్షరాలను ఆయుధాలుగా మార్చి నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నాయి పత్రికలు. ప్రతీ సంవత్సరం మే 3న అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకొంటారు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో పత్రికాస్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి, బలోపేతం చేయడానికి బలమైన చట్టాల అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛను కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది.
అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజల కోసం నిత్యం అక్షరాలను ధారపోస్తూ ధర్మ యుద్ధం చేసే ప్రజల గొంతుక పత్రిక. ప్రజలకు సమాచారం అందించడం కోసమే ప్రజలలో సమాజంపై అవగాహన పెంచడం కోసం వార్తలను వెలుగులోకి తీసుకువచ్చి సమాజాన్ని మెరుగుపరిచే ఆయుధమే పత్రిక. నిరంతరం నిజం కోసం పోరాటం చేస్తూ నిత్యం ప్రజా చైతన్య పోరులో అక్షరాలు ఆయుధాలుగా మార్చి నవ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేస్తున్నాయి పత్రికలు. ప్రతీ సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకొంటారు. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి, పత్రి కా స్వేచ్ఛపై దాడుల నుండి జర్నలిస్టులను రక్షించడానికి ఈ దినోత్సవం ఒక సంద ర్భం. చిలీలోని శాంటియాగోలో యునె స్కో, చిలీ ప్రభుత్వం కలిపి ఈ అంతర్జాతీయ పత్రికాస్వేచ్ఛ దినోత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాయి.
ఈ సంవత్సరం, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం థీమ్ ‘జర్నలిజం కోసం డిజిటల్ యుగం, సమాచారం, శక్తి కోసం పోరాటం’. ఇది డిజిటల్ యుగంలో పత్రికా స్వేచ్ఛ ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను హైలైట్ చేస్తుంది. వీటిలో తప్పుడు సమాచారం వ్యాప్తి, ఆన్‌లైన్ వేధింపులు, జర్నలిస్టులపై పెరుగుతున్న హింసను నిర్మూలించుట కొరకు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. 1993లో యునెస్కో సాధారణ సమావేశంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 1992లో విండోక్‌లో జరిగిన ఆఫ్రికన్ పాత్రికేయుల సెమినార్‌లో ఈ ఆలోచన మొదటగా ఉద్భవించింది. ఈ సెమినార్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గురించి చర్చించడంతోపాటు ఆఫ్రికా ఖండంలో పాత్రికేయ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పరిశీలించా రు. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం. పత్రికా సంస్థలపై దాడులు, హింస, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం. పాత్రికేయుల హక్కులు, భద్రతను కాపాడడం. స్వేచ్ఛా భావం, నిష్పాక్షిక వార్తలను అందించడం వాటిని ప్రోత్సహించడం పత్రిక స్వేచ్ఛలో ముఖ్యమైన అంశాలు.
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో పత్రికా స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయి. ‘రిపోర్టర్స్ వితౌవుట్ బార్డర్స్’ నివేదిక ప్రకారం, 2022లో భారత్ ప్రపంచ పత్రి కా స్వేచ్ఛా సూచీలో 150వ స్థానానికి పడిపోయింది. ఈ మధ్య కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు జర్నలిస్టులపై దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ప్రజాస్వామ్య దేశంలో శాసనసభ కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఎంత ముఖ్యమో నాలుగో స్తంభమైన పత్రికలు కూడా అంతే ముఖ్యం.
పత్రికలను, పత్రికల్లో విలువైన సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత నేటి సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నేటి నియంతృత్వ, నిరంకుశ రాజకీయ నాయకుల వికృత చేష్టల నుండి పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితిని ఎదు ర్కోవడానికి, జర్నలిస్టుల భద్రతను నిర్ధారించడానికి, పత్రికా స్వేచ్ఛను పెంపొంది ంచడానికి ప్రభుత్వంతోపాటు పౌర సమా జం కలిసి పని చేయడం చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కరికీ పాత్ర
పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. మనం స్వతంత్ర జర్నలిజాన్ని మద్దతు ఇవ్వగలగాలి. నమ్మదగిన వార్తా మూలాల నుండి సమాచారాన్ని పంచుకోవచ్చు. అలాగే తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవచ్చు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకం గా మనం మన గొంతును కూడా ఎత్తవచ్చు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య సమాజానికి అవసరం. ఇది ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండేలా చూసుకోవడానికి, పౌరులకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఇవ్వడానికి, దానితోపాటు అందరికీ న్యాయం, సమానత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికలు.
ఈ పత్రికలు ఒక బలమైన ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాలను జవాబుదారిగా ఉంచడానికి, పౌరులకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి పత్రిక కీలక పాత్ర పోషిస్తున్నా యి. దుర్వినియోగం అవుతున్న చట్టాలను నియంత్రించి ప్రజలను చైతన్య పరచటంలో కూడా పత్రికలు కీలక పాత్ర పోషి స్తున్నాయి. అవినీతి, దుర్వినియోగం, అన్యాయాలను బహిర్గతం చేయడానికి పత్రికా స్వేచ్ఛ ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంది. మానవ హక్కుల పరిరక్షణలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి, బలోపేతం చేయడానికి బలమైన చట్టాలు చేయాలి. జర్నలిస్టుల భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలి.
500కు పైగా జర్నలిస్టుల హత్య
2022 సంవత్సరంలో దాదాపు 500కు పైగా జర్నలిస్టులు హత్యగావించబడ్డారు. అలాగే 200 కి పైగా జర్నలిస్టులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వాలు తరచుగా జర్నలిస్టులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా వ్యాప్తిలో నిజమైన జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి నిఖార్సయిన జర్నలిస్టులను, పత్రికా స్వేచ్ఛ ను కాపాడవలసిన అవసరం ప్రభుత్వాలపైన, పౌరులపై ఉంది. అప్పుడే ప్రజా స్వామ్య దేశంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. తద్వారా ప్రజలకి కావలసిన సామాజిక న్యాయాన్ని పత్రికల ద్వారా అందిద్దాం.
వ్యాసకర్త సెల్: 9912197694






