4 July, 2026 | 3:59 PM

బజాజ్ కొత్త పల్సర్ ఎన్‌ఎస్400జడ్

04-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 3: బజాజ్ ఎట్టకేలకు కొత్త 400 సీసీ పల్సర్ బైక్‌ను విడుదల చేసింది. ‘పల్సర్ ఎన్‌ఎస్400జడ్’ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). రూ.5,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కొత్త పల్సర్ కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. గ్రాసీ ఈబోనీ బ్లాక్, మెటాలిక్ పెరల్ వైట్, కాక్‌టైల్ వైన్ రెడ్, ప్యిటర్ గ్రే నాలుగు రంగుల్లో ఎన్‌ఎస్400జడ్ లభిస్తుంది. ఇప్పటివరకూ మా ర్కెట్లోకి వచ్చిన పల్సర్ బైక్‌ల్లోకెల్లా అధిక ఫీచర్లున్న బైక్ ఇదే. ఫుల్లీ డిజిటల్ ఎల్‌సీడీ ఇనుస్ట్రుమెంట్, బజాజ్‌రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్, ప్రొజెక్టర్ లెడ్ హెడ్‌లైట్స్, లెడ్ పొజిషన్ ల్యాంప్స్, లెడ్ టెయిల్ ల్యాంప్స్, బ్లింకర్స్ యూఎస్‌బీ చార్జర్ తదితరాలను అమర్చారు.

వచ్చే నెలలో సీఎన్‌జీ బైక్

బజాజ్ ఆటో వచ్చే నెలలో  సీఎన్‌జీతో నడిచే మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సీఎన్‌జీ, పెట్రోల్ రెండింటితోనూ ఈ బైఫ్యూయల్ బైక్ పరుగులు తీస్తుంది. జూన్ 18న ఈ బండిని తీసుకొస్తామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. ఇప్పటివరకూ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న హీరో మోటో కార్ప్‌కు సవాలు విసురుతూ బజాజ్ ఆటో సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేస్తుందని సమాచారం. ఈ బైక్‌ను పూర్తిగా కొత్త బ్రాండ్‌నేమ్ తీసుకొస్తారు. ఎంట్రీలెవల్ (125 సీసీ, ఆ దిగువన) పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే బైఫ్యూయల్ మోటార్‌సైకిల్ ధర కొంత ప్రీమియంతో ఉంటుందని గతంలో బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. బజాజ్ ప్రవేశపెట్టే సీఎన్‌జీ బైక్‌కు చెందిన ఇతర సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.