02-02-2026 08:50:15 PM
మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్
మేడిపల్లి,(విజయక్రాంతి): సమాజంలో జరిగే మంచి చెడులను ప్రపంచానికి చూపించే పాత్రికేయులు దిక్సూచి లాగా నిలవాలని మేడిపల్లి ఏసిపి మోహన్ కుమార్ అన్నారు. సోమవారం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మేడిపల్లి శాఖ ప్రతినిధులు ఏసీపీ మోహన్ కుమార్ ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు నిక్కచ్చిగా వార్తలు రాయాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తేవాలని అన్నారు.
పాత్రికేయులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం నూతనంగా నియమితులైన డిఐ ఎలక్షన్ రెడ్డిని సైతం కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుజెఐ అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకన్న, భాను కుమార్, నందీష్, కృష్ణ, బివి రాజు, భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.