calender_icon.png 2 February, 2026 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కండక్టర్ టూ సర్పంచ్ సాబ్ కృష్ణనాయక్ జన్మదిన వేడుకలు

02-02-2026 08:54:59 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని సూర్యానాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణ నాయక్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా గ్రామంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని భావించి బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడే సామాన్య వ్యక్తిని తాము గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని గెలిపించుకున్నారు.

తాను చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఉద్యోగాన్ని సంపాదించి పేద ప్రజల కోసం తన ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడం కోసమే ముందుకు వచ్చారని కొనియాడారు. అనంతరం నాయకులు, గ్రామస్తులు కలిసి పలు ఆలయాల్లో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.