జర్నలిస్టులు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి
ది వైర్ వెబ్ సైట్ వ్యవస్థాపక ఎడిటర్ ఎకె. వేణు
ముషీరాబాద్, మార్చి 22(విజయక్రాంతి): జర్నలిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని ప్రముఖ వెబ్ సైట్ ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ ఎంకె. వేణు అన్నారు. ఈ నెల 27, 29 తేదీలలో విజయవాడలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్‌జాతీయ ప్లీనరీని పురస్కరించుకొని ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే, మీడి యా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ)లు సంయుక్తంగా ‘సోషల్ మీడియా ప్రభావం -మంచీ, చెడూ’ అనే అంశంపై సద స్సు సీనియర్ పాత్రికేయులు సోమశేఖర్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిధిగా ఎంకె. వేణు హాజరై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఒకదగ్గర కూర్చొని చేసిన స్టోరీ క్షణాల్లో ప్రపంచం మొత్తం వెళ్తుందని అన్నారు. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని, ఇప్పుడు ట్విట్టర్, పేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్‌లాంటివి డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నాయని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సోమశేఖర్ మాట్లాడుతూ నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రస్తుత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రధాని మన్ కి బాత్ పేరుతో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాడని, ఆనంద్ మహీంద్రా ఓన్ హ్యాండిల్ ఉందని అన్నారు. మెఫీ మేనేజింగ్ ట్రస్టీ, ఐజేయు మాజీ అధ్యక్షులు డి.అమర్ స్వాగతోపన్యాసం చేసిన ఈ సదస్సులో టీయూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. విరాహత్ అలీ, కే. రాంనారాయణ, ఐజే యు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ. మా జీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కే. శ్రీకాంత్ రెడ్డి, వి. యా దగిరిలతో పాటు పలువురు పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.




