1 July, 2026 | 9:09 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలి

01-05-2025 12:05 AM

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్

హనుమకొండ, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని చేపడుతున్న మహా ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పాల్గొన్నారు. తదనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇచ్చి ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని కోరారు.

హసన్ పర్తి లో 18 మంది జర్నలిస్టులకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్హులైన వరంగల్ లో ఉన్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏమి అమలు పరచకుండా పబ్బం గడుపుకుంటుందని  అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు,  మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.