10-07-2025 12:29:10 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోతిరే
కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై 9(విజయ క్రాంతి):ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారదులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆసిఫాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లాలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయికుమార్, సదాశివ్, కోశాధికారి చరణ్ ,జర్నలిస్టులు పాల్గొన్నారు.