calender_icon.png 10 July, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగా నర్సమ్మకు అశ్రునివాళి

10-07-2025 12:30:15 AM

- జనసంద్రంగా మారిన రేగా స్వగ్రామం 

- కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

- కదిలి వచ్చిన అశేష జనవాహిని

-కన్నీటితో అంతిమ వీడ్కోలు

మణుగూరు, జూలై 9 ( విజయ క్రాంతి ) :  పినపాక మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ (85)స్వగ్రామం కరక గూడెం మండలం సమత్ బట్టుపల్లి గ్రామం లో బుధవారం తెల్లవారు జామున అనారోగ్యంతో మృతిచెందారు.రేగా మాతృమూర్తి మరణ వార్త తెలుసుకున్న వేలాది మంది బీ ఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వి విధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎ త్తున కాంతారావు స్వగృహానికి తరలివచ్చి అ మృతమూర్తికి అశ్రు నివాళి అర్పించారు.

కడసారి ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికేందు కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మా జీ ఎమ్మెల్యే స్వగ్రామం సమత్ బట్టుపల్లి అశే ష ప్రజానీకంతో జనసంద్రంగా మారింది. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపుగా బయలుదేరిన అంతిమ యాత్ర లో రేగా అభిమానులు,కుటుంబసభ్యులు, రాజకీయ, వ్యాపార, సామాజిక ప్రముఖులు, కదిలి రాగా, అంతిమయాత్ర కుటుంబ సభ్యుల కన్నీటి రోధనలు మధ్య జరిగాయి.

జిల్లా ప్ర జలు చివరిసారిగా అమృతమూర్తి భౌతిక కాయం సందర్శించి, పూల మాలలతో కడసారి నివాళి అర్పించి కన్నీటి వీడ్కోలు పలి కారు.గ్రామ సమీపం లోని వ్యవసాయ క్షే త్రంలో బుధవారం సాయంత్రం వెల్లువలా తరలివచ్చిన అశేష జనవాహిని అభిమానులఅశ్రునయనాలతో ఆమె పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు దహన క్రియలు నిర్వహించారు అనంతరం పలు పార్టీలకు చెంది న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  కాంతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

పలువురి సంతాపం 

రేగా మాతృమూర్తి మృతి పట్ల బీ ఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ ఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కాంతారావు ను ఫోన్ ద్వారా పరామర్శించిన ఆయన వా రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిం చారు. అశ్వరావుపేట, ఇల్లందు మాజీ ఎమ్మెల్యేలు, మెచ్ఛా నాగేశ్వరావు, బానోతు హరి ప్రియ నాయక్, ప్రముఖ వ్యాపారవేత్త దోసపాటి పిచ్చేశ్వర రావు, కాంట్రాక్టర్ పి.వి చారి,జిల్లా కాంగ్రెస్ నాయకులుతూల్లురి బ్ర హ్మయ్య, అశ్వాపురం బూర్గంపాడు మాజీ జెడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ గోపిరెడ్డి, కా మిరెడ్డి శ్రీలత కొండారెడ్డి, సామాజిక కార్యకర్త కర్నె రవి, కర్నే బాబురావు, న్యాయవాది నాగార్జున రెడ్డి, మణుగూరు మాజీ జెడ్పిటిసి పోసం నరసింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యంబాబు, టీబీజీకేస్ నాయకులు నాగే ల్లి వెంకట్, నాగేశ్వరరావు తదితరులు కాం తారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.