16 May, 2026 | 4:24 PM

Breaking News

బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా అడిచెర్ల రాజు   •   సిబ్బంది భద్రతకు మరింత పటిష్ట చర్యలు   •   దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి   •   దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ జయ   •   నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •  

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

16-05-2026 03:49 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి వారి పోరాటపటిమను గుర్తించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిటీని నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ హర్షం వెలిబుచ్చారు. శనివారం యన కోదాడలో మాట్లాడుతూ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి న్యాయం చేయలేకపోయారని వారికి కనీస గౌరవం కూడా లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేస్తామని 250 చదరపు గజముల స్థలము మరియు పెన్షన్లు నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరం లు అయిపోయిన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం కేకే గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ తొందరగా ఉద్యమకారులను గుర్తించి విధివిధానాలు నిర్ణయించవలసిందిగా కోరినారు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నేడు బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు ఉద్యమంలో అమరులైన అమరవీరులకు కుటుంబాలకు మరియు అంగవైకల్యం పొందిన వారికి బైండోవర్ కేసులో ఉన్న వారికి ఎఫ్ఐఆర్ లు ఉన్నవారికి మొదటగా న్యాయం చేయాలని అన్నారు.