28 June, 2026 | 3:12 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కుటుంబాన్ని పరామర్శించిన జడ్జి దుర్గం గణేష్

21-04-2026 08:16 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద ఘటనలో ప్రభావితమైన కుటుంబాన్ని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబం పనిచేస్తున్న ఇటుక బట్టీని సందర్శించి, అక్కడి కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు.

న్యాయ సేవా సంస్థల ద్వారా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా జడ్జికి పంపిస్తామని చెప్పారు.

జడ్జి వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, ఏజీపీ దూడం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.