వైభవంగా దుర్గాభవానీ సుందరేశ్వరుల కల్యాణం
21-04-2026 08:14 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం శ్రీ దుర్గాభవానీ సుందరేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పండితులు రుద్ర హోమం, చండీహోమం మహా పూర్ణహుతి, జగద్గురు శంకరాచార్య జయంతి పురస్కారించుకుని ఆలయ ప్రాంగణంలోని ఆది శంకరాచార్య ఆలయంలోని ఆదిశంకరాచార్యులకు విశేష అభిషేకం, విశేష హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మన్, కమిటి భాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, పడకంటి వినోద్, హరిచంద్ర ప్రసాద్‌తోపాటు భక్తులు పాల్గోన్నారు.






