28 June, 2026 | 2:04 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఈనెల 24న పింగళి మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా

21-04-2026 08:18 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి లోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ (టిఎస్కేసి) కోఆర్డినేటర్ పిడి సుజాత, మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని ఈ జాబ్ మేళాకు సుమారు 12 ప్రముఖ సంస్థలు పాల్గొని, నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.

ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 2019 నుండి 2026 వరకు పాసైన విద్యార్థులు మాత్రమే అర్హులని, అభ్యర్థులు తమ విద్య అర్హతల ధ్రువపత్రాలు, బయోడేటా వెంట తీసుకొని హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం టీఎస్ కే సి మెంటల్ ఎం.డి రఫీ 9885685383 నెంబర్ ను సంప్రదించండి. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.