17 June, 2026 | 10:24 PM

ఇందిరమ్మ ఇళ్ల పై జుక్కల్ ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

17-06-2026 08:58 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గురువారం నాడు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు  ఆయన వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు. ఉదయం 11 గంటల నుండి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు హాజరై తమకు ఎలాంటి సమస్యలున్న తమకు తెలియజేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, హౌసింగ్ పీడీ తదితర జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని వారు పవర్కొన్నారు. త్వరితగతిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.