calender_icon.png 9 June, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న చిరునవ్వు చాలు!

08-06-2025 12:00:00 AM

కెరీర్‌లో ఉన్నత స్థానాలే లక్ష్యంగా ఉరుకుల, పరుగులతో రోజంతా గడిచిపోతుం ది. దీని మధ్యలో వ్యక్తిగత జీవితానికి చోటు లేకుండా పోతుంది. అందుకే భార్యాభర్తల బంధం నానాటికీ బీటలు వారుతున్నది. వీటన్నింటికీ మైక్రో విధానమే పరిష్కారమంటున్నారు నిపుణులు. మైక్రో ఇదేంటి అనుకోకండి. మైక్రో అంటే చిన్న, రొమాన్స్‌లో మాన్స్ కలిపి ఇలా పేరొచ్చింది.

భార్యాభర్తల బంధం దృఢంగా ఉండటానికి ఇప్పటితరానికి ఇది చాలా అవసరమట. ఎదుటి వ్యక్తిని మనం ఎంత ప్రేమిస్తున్నామో చెబితేనే కదా తెలిసేది. అందుకే ఉదయాన్నే గుడ్‌మార్నింగ్ అంటూ చిన్న పలకరింపు. మధ్యాహ్నం లంచ్ అయ్యిందా అని మెసేజ్. మంచి దుస్తులు వేసుకున్నప్పుడు బాగున్నావు అంటూ చిన్న ప్రశంస, పని అయ్యాక వీలుంటే కలిసివెళ్దాం అని చెప్పడం.

ఇంటికి చేరుకున్నాక కలిసి వండటం.. తినడం.. ఇవి సరిపోవా? ఇరువురి మధ్యా ఉన్న దూరాన్ని పూరించడానికి. అవతలి వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పడానికి. మైక్రో ట్రెండ్ కూడా ఇదే చెబుతుంది. పైగా మీ ఈ చిన్నచిన్న పలకరింపులే అవతలి వారికి ఒత్తిడిని దూరంచేసే సాధనాలు అవుతాయి.