19 July, 2026 | 2:14 AM

టైటిల్‌కు అడుగే దూరం

19-07-2026 12:00 AM

జపాన్ ఓపెన్ ఫైనల్లో సింధు

టోక్యో, జూలై 18 : భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌పై గెలవడం ద్వారా ఈ టోర్నీ ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. తొలి గేమ్‌ను 21-19తో గెలిచిన సిం ధు రెండో సెట్‌లోనూ దూకుడు కొనసాగించింది.

15-10 స్కోరుతో ఆధిక్యంలో ఉం డగా ప్రత్యర్థి చెన్ యుఫీయ్ గాయంతో త ప్పుకోవడంతో సింధు విజేతగా నిలిచింది. కాగా గత ఏడా ది  సయ్యద్ మోదీ ఇం టర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఏ టోర్నీలోనూ ఫైనల్ చేరలేదు. రెండేళ్ల నిరీక్షణకు తెరదించిన ఆమె జపాన్ ఓపెన్ ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెం దిన అకానే యమగుచితో తలపడనుంది.  గత రికార్డుల్లో యమగుచిపై 15-14 తో సింధు దే పైచేయిగా ఉంది.