19 July, 2026 | 2:15 AM

పతాకధారులుగా మీరాబాయి, లవ్లీనా

19-07-2026 12:00 AM

కామన్‌వెల్త్‌గేమ్స్‌కు 126 మందితో భారత బృందం

న్యూఢిల్లీ, జూలై 18 : ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌గేమ్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. గ్లాస్గో వేదికగా ఈ నెల 23 నుంచి జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుంచి 126 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఆరంభవేడుకల్లో భారత బృందానికి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చా ను, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో ఒ లింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి ఈ సారి మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో 12 మంది బరిలో ఉన్నారు.

అటు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా 75 కిలోల విభాగంలో తలపడుతోంది. అథ్లెటిక్స్‌లో 32 మంతితో కూడిన భారత బృందంపై ఎక్కువ అంచనాలున్నాయి. నీరజ్ చోప్రా, తేజస్విని శంకర్, తాజిందర్‌పాల్‌సింగ్ తూర్ వంటి అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. గత ఎడిషన్‌తో పోలిస్తే ఈ సారి రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్, స్కాష్, టేబుల్ టెన్నిస్, షూ టింగ్, బీచ్ వాలీబాల్, ట్రయాథ్లాన్, రగ్బీ సెవెన్స్ వంటి క్రీడలను తొలగించారు.